close

తాజా వార్తలు

ఆ సినిమా చాలా బాగుంది: మహేశ్‌

‘అసురన్‌’ చిత్రబృందాన్ని ప్రశంసించిన టాలీవుడ్‌ ప్రిన్స్‌

హైదరాబాద్‌: ధనుష్‌ నటించిన ‘అసురన్‌’ సినిమా చాలా అద్భుతంగా ఉందని అన్నారు టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుల వివక్ష, భూ వివాదాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని ఇప్పటికే ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఈ చిత్రబృందాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా ‘అసురన్‌’ చిత్రబృందాన్ని మహేశ్‌బాబు ప్రశంసించారు. సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నిజజీవితంలో ఎదుర్కొనే కొన్ని సంఘటలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ‘అసురన్‌’ సినిమా చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు వెట్రిమారన్‌, కథానాయకుడు ధనుష్‌, ప్రకాష్‌రాజ్‌ తోపాటు చిత్రబృందానికి నా అభినందనలు.’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది విడుదలైన ‘మహర్షి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రిన్స్‌ మహేశ్‌ బాబు. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.