close

తాజా వార్తలు

కాలం మరిచిన యోధుడి కథతో మామాంగం

‘మామాంగం’లో ఓ దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: మలయాళంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చరిత్ర నేపథ్య చిత్రం ‘మామాంగం’. తెలుగు, తమిళం, హిందీలోనూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్ని ముకుందన్‌, సిద్ధిక్‌, మణికుట్టన్‌, కనిక, అను చిత్రాలు ఇతర తారాగణం. జయచంద్రన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పద్మకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘1680 కాలానికి చెందిన ఓ మహావీరుడి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రాజా జామో అనే రాజు అరాచకాలకు వ్యతిరేకంగా సావేర్స్‌ అనే ఓ బృందం చేసిన పోరాటమే ఈ చిత్ర కథ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర మరిచిపోయిన ఓ మహా యోధుడి కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. తమిళ వెర్షన్‌కు రామ్‌ మాటలు రాశారు. మమ్ముట్టి తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ప్రాచీన తమిళంలోనే ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ఏకకాలంలో నాలుగు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నా’మని పేర్కొన్నారు. ఈ చిత్రానికి మనోజ్‌పిల్లై సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.