close

తాజా వార్తలు

సోషల్‌మీడియా నియంత్రణకు కొత్త నిబంధనలు

వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రూపొందిస్తామన్న కేంద్రం

దిల్లీ: సోషల్‌మీడియాలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలు, పరువునష్టం కలిగించే పోస్టులను నియంత్రించడం కోసం వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సరికొత్త నిబంధనలు రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. 

సోషల్‌మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే విషయమై మద్రాస్‌, బొంబాయి, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లో దాఖలైన కేసులను మొత్తం ఒకేచోటుకు బదిలీ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ అంశంపై హైకోర్టుల్లో పెండింగ్‌ల్లో ఉన్న అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయించింది. 2020 జనవరి చివరి వారంలో ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపడుతుందని వెల్లడించింది. 

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల కార్యకలాపాలను నియంత్రించే నిబంధనల రూపకల్పనపై జనవరిలో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కేంద్రం.. జనవరి 15 నాటికి కొత్త నిబంధనలను రూపొందిస్తామని ప్రకటించింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.