close

తాజా వార్తలు

విజయ్‌ ఫ్యాన్స్‌ ఆలోచన అదుర్స్‌

చెన్నై: ఇటీవల రోడ్డుపై ఏర్పాటు చేసిన బ్యానర్‌ తెగిపడడం వల్ల చెన్నైకు చెందిన ఓ టెకీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది కోలీవుడ్‌ సెలబ్రిటీలు తమ సినిమా విడుదలైనప్పుడు ఎటువంటి బ్యానర్లను, హోర్డి్ంగ్‌లను ఏర్పాటు చేయవద్దని, ఆ డబ్బును ఏదైనా మంచి పనికి వాడమని అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో హీరో విజయ్‌ అభిమానులు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. విజయ్‌ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘బిగిల్‌’. అక్టోబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ హీరో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో విజయ్‌ అభిమానులు బ్యానర్లను ఏర్పాటు చేయకుండా ఆ డబ్బుతో మీనాక్షిపురం బాలికల ఉన్నత పాఠశాల పరిసరాల్లో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమానికి తిరునల్వేలి జిల్లా పోలీస్‌ కమిషనర్‌ అర్జున్‌ శరవణన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

‘తెరి’, ‘మెర్సల్‌’ సినిమాల తర్వాత దర్శకుడు అట్లీ - విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘బిగిల్‌’. నయనతార కథానాయిక. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాతి ఎస్‌. అఘోరాం. కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని ‘విజిల్‌’ పేరుతో విడుదల చేయనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.