
తాజా వార్తలు
సిద్ధరామయ్యను ప్రశ్నించిన మహిళలు
బెంగళూరు: కర్ణాటకలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బుధవారం ఉదయం సందర్శించారు.రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో నష్టం సంభవించింది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు వీలైనన్ని సౌకర్యాలు కల్పించలన్నారు.ఈ క్రమంలో ఆయన బాదామి ప్రాంతంలో పర్యటిస్తుండగా కొందరు మహిళలు ఆయన కారు ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు. ‘మీకు ఓట్లు వేస్తే మాకు ఇళ్లు ఇస్తామన్నారు. ఆ ఆశతోనే మేము మీకు ఓట్లేశాం కానీ ఇప్పటి వరకు ఇళ్లు మంజూరు చేయలేదు. ప్రస్తుతం వరదలు వచ్చి మేము రోడ్డున పడ్డాం. మాకు దిక్కెవరు?, మీకు ఓట్లేశాం.. మీకు ఓట్లు వచ్చాయి. కానీ మాకు ఇళ్లు రాలేదు. మాకు ఇప్పుడు ఇళ్లు ఎవరు ఇస్తారు’ అంటూ మహిళలు ఆయనను నిలదీశారు. కొంత సేపు ఆయన కారును కదలనివ్వకుండ అడ్డు పడ్డారు. అధికారులు, భద్రతా సిబ్బంది మహిళలకు నచ్చజెప్పడంతో వారు ఆందోళనను విరమించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
