close

తాజా వార్తలు

టీ10లో పాక్‌ ఆటగాళ్లకు అనుమతి రద్దు

కరాచి: అబుదాబిలో జరగనున్న టీ10 క్రికెట్‌ లీగ్‌లో పాల్గొనవద్దని పాక్‌ ఆటగాళ్లకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. అంతకుముందు టీ10 క్రికెట్‌కు పీసీబీ అనుమతి ఇచ్చినా ఆటగాళ్లపై పనిభారం అధికమవుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని వారిపై పనిభారం పెరగకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. పాక్‌ ఆటగాళ్లు దేశవాళీ క్వాద్‌-ఈ-అజామ్‌ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. దీంతో టీ10 క్రికెట్‌కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాం’ అని పీసీబీ పేర్కొంది. పొట్టి ఫార్మాట్‌ అయిన టీ10 టోర్నీలో పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. దీంతో ఈ లీగ్‌లో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రీది కూడా బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌ 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీనిలో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.