close

తాజా వార్తలు

తమిళ సూపర్‌హిట్‌ మూవీ రీమేక్‌లో వెంకీ

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ సినిమాల జోరు పెంచారు. తాజాగా తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అసురన్‌’ రీమేక్‌లో నటించనున్నట్లు సురేష్‌ ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన అసురన్‌.. ఇటీవలే విడుదలై బాక్సీఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో రీమేక్‌ చేయనున్నట్లు నిర్మాత సురేష్‌ బాబు వెల్లడించారు. తమిళ నిర్మాత కళైపులి ఎస్‌ థానుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. కథానాయిక, దర్శకుడు ఇతర సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరోవైపు వెంకటేశ్‌ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తుండగా.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌ బాబు నిర్మిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.