
తాజా వార్తలు
ఢాకా: గాయం కారణంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహమ్మద్ సైఫుద్దీన్ భారత పర్యటన నుంచి తప్పుకొన్నాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెన్ను నొప్పితో అతడు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మెగాటోర్నీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు అతడు ఎంపికయ్యాడు. కానీ, గాయం తిరగబెట్టడంతో శ్రీలంక సిరీస్ నుంచి వైదొలగాడు. సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచి వచ్చే నెలలో జరగనున్న భారత టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, మరోసారి గాయం తీవ్రత పెరగడంతో భారత పర్యటనకు అతడు దూరమయ్యాడు. ‘వెన్ను నొప్పి కారణంగా భారత పర్యటనకు సైఫుద్దీన్ దూరమయ్యాడు. అతడికి విశ్రాంతి అవసరం’ అని బంగ్లా జట్టు వైద్యుడు తెలిపారు.
సైఫుద్దీన్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని బంగ్లా సెలక్టర్ హబీబుల్ బషర్ పేర్కొన్నారు. ‘జట్టు యాజమాన్యం అతడి స్థానంలో మరో ఆటగాడిని కోరుకుంటే ఎంపిక చేస్తాం. పొరుగు దేశమైన భారత్‌లోనే సిరీస్ కాబట్టి ఏ క్షణంలోనైనా ఎంపిక చేయవచ్చు’ అని అన్నారు. బంగ్లాదేశ్ తరఫున సైఫుద్దీన్ 20 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 262 పరుగులతో పాటు 24 వికెట్లు, టీ20ల్లో 108 పరుగులు, 12 వికెట్లు తీశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దిల్లీ వేదికగా నవంబర్ 3న భారత్‌తో బంగ్లా తొలి మ్యాచ్‌ను ఆడనుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్
- బురద చల్లేందుకే ‘రౌండ్‌టేబుల్’:అంబటి
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
