
తాజా వార్తలు
పణజీ: కర్ణాటకలో కలస-బంధూరి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రకాశ్ జావడేకర్ మంత్రిగా ఉన్న వాతావరణ, అటవీ, పర్యావరణ శాఖను ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో బెళగావి, ధార్వాడ్, గడగ్ జిల్లాలకు తాగునీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తాజాగా దీని నిర్మాణం పట్ల కేంద్రం సానుకూల వైఖరి వ్యక్తం చేసింది. అయితే దీని కారణంగా గోవాలోని అటవీ, జంతు సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నది సావంత్ వాదన. దీనికి కొంతమంది పర్యావరణవేత్తలు సైతం మద్దతుగా నిలిచారు.
ప్రాజెక్టుపై ఇచ్చిన సమ్మతి లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రమోద్ సావంత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై అధికారికంగా లేఖ రాస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రకాశ్ జావడేకర్తో చర్చించానన్నారు. సమ్మతి తెలపడం అంటే దాదాపు అనుమతులు లభించినట్లేనని భావించి కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందన్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ.. లేదంటే జాతీయ హరిత ట్రైబ్యునల్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీని కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని కోరతామన్నారు. ఈ విషయంలో కేంద్రం గోవా ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్న విషయాన్ని ప్రధానికి తెలియజేస్తామన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
