close

తాజా వార్తలు

దీపిక పాటకు మహేశ్‌ కుమార్తె డ్యాన్స్‌

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె పాటకు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కుమార్తె సితార డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీపికా పదుకొణె - రణవీర్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘రామ్‌లీలా’.  ఇందులోని ‘నగాడ సంగ్‌ డోలు భాజే’ అంటూ సాగే  పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో దీపికా పదుకొణె డ్యాన్స్‌తోపాటు ఆమె ధరించిన డ్రెస్‌ గురించి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. అయితే తాజాగా ఆ పాటకు సితార ముద్దు ముద్దుగా డ్యాన్స్‌ చేసింది. ‘మీ అందరికీ దీపావళి సందర్భంగా చిన్న ట్రీట్‌. తన కొత్త గాగ్రాను ధరించి డ్యాన్స్‌ చేస్తున్న సితార. ఈ దీపావళి మీకు మరిన్ని సంతోషాలను అందించాలి.’ అని నమ్రత పేర్కొన్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.