close

తాజా వార్తలు

హాలీవుడ్‌ చిత్రంపై సమంత ప్రశంసలు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంత ఓ హాలీవుడ్‌ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకూ తాను చూసిన చిత్రాల్లో ‘జోకర్‌’ చాలా గొప్ప సినిమా అని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్‌ నటుడు జోక్విన్‌ ఫినిక్స్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘జోకర్‌’. డీసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన సమంత సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘నేను ఇప్పటి వరకూ చూసిన చిత్రాల్లో ‘జోకర్‌’ చాలా గొప్ప సినిమా. జోక్విన్‌లాగా మరొకరు ఉండరు’ అని సమంత ఇన్‌స్టా వేదికగా తెలిపారు.

ఈ ఏడాది విడుదలైన ‘మజిలీ’, ‘ఓ బేబి’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి సమంత. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయవంతమైన ‘96’ సినిమా తెలుగు రీమేక్‌లో నటించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాతృకను తీసిన సి.ప్రేమ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.