
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ‘టామ్ అండ్ జెర్రీ’.. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకూ వయసుతో సంబంధం లేకుండా విశేషంగా అలరించిన కార్టూన్ పాత్రలు. వెక్కిరించి పారిపోయే ఎలుక.. వెంటపడి మరీ వేధించే పిల్లి పాత్రల మధ్య పోరు చూస్తే నవ్వు ఆపుకోకుండా ఎవరూ ఉండలేరు. ఎలుకను పట్టుకునేందుకు పిల్లి అనేక పథకాలు వేస్తే, వాటిని తనకు అనుగుణంగా మార్చేసుకుని పిల్లినే పరుగులు పెట్టిస్తుంది. వాటి మధ్య జరిగే ఆ సరదా ఆట చక్కిలిగింతలు పెడుతుంది.
ఇప్పుడు ఈ పాత్రలతో హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఓ లైవ్ యాక్షన్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16, 2021న విడుదల చేయాల్సి ఉండగా, కాస్త ముందుగానే పిల్లి-ఎలుకలు థియేటర్లో సందడి చేయనున్నాయి. టిమ్ స్టోరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అప్పట్లో విజయవంతమైన పలు కామిక్ చిత్రాలను, యానిమేషన్ కథలను ఇప్పుడు లైవ్ యాక్షన్‌గా తీర్చిదిద్దుతున్నారు. పైగా ప్రాంతీయ భాషలకు చేరువయ్యేందుకు అక్కడి నటులతో ఆ పాత్రలకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇటీవల ‘ది లయన్ కింగ్’ విషయంలో అదే జరిగింది. మరి ‘టామ్ అండ్ జెర్రీ’ పాత్రలకు ఎవరెవరు గొంతు ఇస్తారో లేదా కేవలం సంభాషణలతో పనిలేకుండా ఎలుక-పిల్లి సందడి చేస్తాయో చూడాలి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
