close

తాజా వార్తలు

‘ఖైదీ’పై హరీశ్‌ శంకర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌: కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా అటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ‘ఖైదీ’ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఖైదీ’ ఒక అద్భుతమైన చిత్రం. పవర్‌ఫుల్‌ స్ర్కీన్‌ప్లేతో ఓ అసాధారణమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తి నటన చాలా బాగుంది. చిత్రబృందానికి నా అభినందనలు.’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

ఈ చిత్రంలో.. 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన దిల్లీ అనే ఖైదీ పాత్రలో కార్తి నటించారు. ఈ చిత్రానికి లోకేశ్‌ కనకరాజ్ దర్శకత్వం వహించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌, వివేకానంద ఫిల్మ్స్‌ పతాకాలపై ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. శామ్‌ సీ.ఎస్‌. స్వరాలను అందించారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.   


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.