close

తాజా వార్తలు

నెట్టింటి పుట్టినరోజు

స్కూల్లో హోంవర్క్‌ ఇచ్చినా... చదివేటప్పుడు ఏదైనా డౌట్‌ వచ్చినా... వెంటనే చూసేది ఇంటర్నెట్టే...  ఈరోజు దీని గురించి ఎందుకంటే... ఇవాళ ఇంటర్నేషనల్‌ ఇంటర్నెట్‌ డే... పైగా ఇప్పటికి ఇది పుట్టి 50 ఏళ్లు అవుతోంది!

అంతర్జాలం గురించి మీకు తెలిసింది చెప్పండి అంటే.. వెంటనే దీంతో ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇంకా బోలెడన్ని మెసేజ్‌లు పంపుకోవచ్చు. వీడియో ఫోన్లు మాట్లాడుకోవచ్చు అంటూ టకటకా దాని గురించి ఎన్నో సంగతులు చెప్పేస్తారు కదూ... మరి ఈరోజు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారా?!

ఇలా పుట్టింది!

అమెరికా భద్రతా విభాగం ‘అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ’ 1969 అక్టోబర్‌లో మొదటిసారిగా ఇంటర్నెట్‌ని కనిపెట్టింది. అప్పట్లో దీన్ని ఆర్పానెట్‌ అని పిలిచారు. టిమ్‌ బెర్నర్స్‌ లీ అనే ఆయన 1989లో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ని కనిపెట్టాడు. మీరు గమనించారో లేదో అందుకే వెబ్‌సైట్‌ ‌www తోమొదలవుతుంది.

రెండింటికీ తేడా!

ఇంటర్నెట్‌కీ వరల్డ్‌వైడ్‌ వెబ్‌కీ తేడా ఉంది. ఇంటర్నెట్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల కంప్యూటర్లని కలిపి ఉంచే వ్యవస్థ.
* ఇంటర్నెట్‌ని ఉపయోగించి పొందే లింక్‌ పేజీల సమాహారం వరల్డ్‌ వైడ్‌ వెబ్‌. అంటే దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేజీల్ని చూడొచ్చన్నమాట.

మొట్టమొదటివి!

* మొదటి ఈ-మెయిల్‌ని రే టామిలిన్సన్‌ అనే ఆయన తనకు తానే 1971లో పంపుకున్నాడు. పంపే సమాచారం యంత్రానికి కాకుండా వ్యక్తికే అనే సూచన కోసం @ గుర్తు వాడారట.
* మొదటి వెబ్‌క్యామ్‌ని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఒక కాఫీ మెషిన్‌ను పర్యవేక్షించడానికి ఉపయోగించారు.
* మొదటి వెబ్‌సైట్‌ info.cern.ch
* అంతర్జాల వాడకాన్ని ఒక హక్కుగా చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఫిన్లాండ్‌.
* బెర్నర్స్‌ లీ అనే ఆయన నలుగురు అమ్మాయిల జోక్‌ బ్యాండ్‌ ఫొటోను మొదటిసారిగా అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేశాడు.

మన కోసం...

పిల్లల కోసం ప్రత్యేక సెర్చ్‌ ఇంజిన్లు, వెబ్‌సైట్లూ ఉన్నాయి.వాటిల్లో కొన్ని...
‌www.kidtopia.info
www.kidzsearch.com
www.kiddle.co
www.lures.info
https://duckduckgo.com
www.alarms.org
www.curiousworld.com
https://pbskids.org
https://kids.nationalgeographic.com
www.abcmouse.com
www.babytv.com
www.agnitus.com
www.brainpop.com
www.kidsone.in
www.howstuffworks.com

మీకు తెలుసా?

*  వెబ్‌సైట్‌ చిరునామానే యూఆర్‌ఎల్‌ అంటారు. అంటే యూనిఫాం రిసోర్స్‌ లోకేటర్‌.
*  గడిచిన పదేళ్లలోనే ఇంటర్నెట్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. షాపింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, గేమ్స్‌, న్యూస్‌, పర్యటక సమాచారం, వ్యాపారం, మార్కెటింగ్‌ ఇలా అన్నిట్లోనూ నెట్‌ దూసుకుపోతోంది.
*  ఎక్కువగా ఉపయోగించే సర్వీస్‌... వెబ్‌. దీంట్లో వెబ్‌సైట్లు... వికీ, వెబ్‌పేజెస్‌ ఉంటాయి.  దీని తర్వాత ఈమెయిళ్ల బదిలీలు.
*   యూట్యూబ్‌లో నిమిషానికి 500 గంటల నిడివి గల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి.
*  మనదేశంలో 1995 నుంచి అంతర్జాలం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
*  అత్యధికంగా అంతర్జాలాన్ని ఉపయోగించే దేశాల్లో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, భారత్‌లు ఉన్నాయి.
*  ఇంటర్నెట్‌కి బానిసైనవాళ్ల కోసం చైనాలో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
*  రోజుకు దాదాపు 29,300 కోట్ల ఈ-మెయిల్‌ సందేశాలు ప్రపంచవ్యాప్తంగా బదిలీ అవుతున్నాయట.

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.