close

తాజా వార్తలు

సమంత బ్యాగ్‌ @ లక్ష

హైదరాబాద్‌: అందమే కాదు.. తన ఫ్యాషన్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి సమంత అక్కినేని. తాజాగా సమంత ధరించిన బ్యాగ్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కానీ ధర తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ఆ బ్యాగ్‌ ధర అక్షరాలా లక్ష రూపాయలట. ఇది లూయీస్ విట్టర్‌ బ్రాండ్‌కు చెందినది. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం సమంత విదేశాలకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో సమంత బ్లూ కలర్‌ జీన్స్‌, బ్రౌన్‌ కలర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌తో కనిపించారు. బ్యాగ్‌ చాలా అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్ల రూపంలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాగ్‌ ధర గురించి ఆరా తీయగా.. దాని ధర లక్ష రూపాయలు ఉంటుందని తెలిసింది.

మరోవైపు తమిళంలో మంచి విజయం సాధించిన ‘96’ తెలుగు రీమేక్‌లో ప్రస్తుతం సమంత నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ‘జాను’ పాత్రలో నటించడం ఒక సవాలు అని సమంత పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.