close

తాజా వార్తలు

మార్నింగ్‌ వాక్‌.. ఓ జీవిత పాఠం

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌

ముంబయి: కుమార్తెతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్తే.. అది ఓ జీవితం పాఠం నేర్పిందన్నారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌. ఇటీవల ఆయన నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అక్షయ్‌ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన కుమార్తె నితారాతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. ఆ సమయంలో దాహం వేయడంతో ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లగా వారు ప్రేమతో అక్షయ్‌, ఆయన కుమార్తెకు రోటి చేసి పెట్టారు.

ఈ విషయాన్ని అక్షయ్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా, ట్విటర్‌లలో షేర్‌ చేస్తూ.. ‘నా కుమార్తె నితారాతో కలిసి ఈ రోజు మార్నింగ్‌ వాక్‌కు వెళ్తే.. అది తనకు ఓ జీవిత పాఠాన్ని నేర్పించింది. దాహంగా ఉండడంతో మంచినీళ్ల కోసమని మేము ఎంతో దయ గలిగిన ఈ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లాం. వాళ్లు మాకోసం ఎంతో ప్రేమతో రోటి చేసి పెట్టారు. నిజం చెప్పాలంటే దయాగుణం వెలకట్టలేనిది.’ అని అక్షయ్‌ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.