
తాజా వార్తలు
హైదరాబాద్: అగ్రకథానాయకుడు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం వచ్చిందట. ఇటీవల బాలీవుడ్ సినీ ప్రముఖులను మోదీ దిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్, సోనమ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్ సింగ్, కంగనా రనౌత్, ఏక్తా కపూర్, రాజ్‌కుమార్ హిరాణీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలు రూపొందించిన పలు సాంస్కృతిక వీడియోలను మోదీ విడుదల చేశారు. మోదీతో కలిసి కార్యక్రమంలో దిగిన ఫొటోలను సినీస్టార్స్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా మోదీ కేవలం బాలీవుడ్ ప్రముఖుల్ని మాత్రమే పిలవడంతో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదిని నిర్లక్ష్యం చేశారని, ఇక్కడి వారిని కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఇప్పుడు దిల్లీకి రమ్మని మోదీ నుంచి చిరు, చరణ్‌కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు చరణ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘నేను, నాన్న ప్రధానిని కలవబోతున్నాం. త్వరలోనే ఇది జరుగుతుంది. ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్తాం. ఈ సమావేశం కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ఆయన అన్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
