close

తాజా వార్తలు

‘అవతార్‌2’ షూటింగ్‌ ఎక్కడ జరుగుతోందంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అవతార్‌’. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి. ప్రపంచ సినీ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన చిత్రం. ఈ సినిమా విడుదలై 10ఏళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా డిస్నీ+ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ద్వారా దీనిని ప్రేక్షకులు వీక్షించే సదుపాయం కల్పిస్తోంది. నవంబరు 12వ తేదీ నుంచి యూఎస్‌, కెనడా, నెదర్లాండ్స్‌లకు అందుబాటులోకి రానుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో నవంబరు 19 నుంచి దీన్ని వీక్షించవచ్చు. 

ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వెల్లడించారు. అంతేకాదు, ప్రస్తుతం అవతార్‌ సీక్వెల్స్‌ను న్యూజిలాండ్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ‘‘మీకో ఆసక్తికర విషయాన్ని చెప్పడానికి సీక్వెల్స్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నా. నవంబరు 12వ తేదీ నుంచి డిస్నీ ప్లస్‌లో ‘అవతార్‌’ను వీక్షించవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. 

‘అవతార్‌’ ఇచ్చిన విజయంతో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సీక్వెల్స్‌ కథలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి వరుసగా డిసెంబరు 17, 2021.. డిసెంబరు 22, 2023న వస్తాయి. ఇక ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ చిత్రాల విడుదల తేదీలను కూడా కామెరూన్‌ ప్రకటించారు. డిసెంబరు 19, 2025, డిసెంబర్‌ 17, 2027లో ఆ చిత్రాలు విడుదలవుతాయి. ఇంతకీ ఈ సీక్వెల్స్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా? ఒక బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.6539 కోట్లు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.