close

తాజా వార్తలు

అమితాబ్‌, రజనీ అతిథులుగా..

ముంబయి: 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ నిర్వహణకు (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) సన్నాహాలు మొదలయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ వేడుకలకు గోవా వేదికైంది. నవంబరు 20 నుంచి 28 వరకు ఈ చిత్రోత్సవం జరగనుంది. కాగా ఈ ఫెస్టివల్‌ ఓపెనింగ్‌ కార్యక్రమానికి షెహెన్‌షా అమితాబ్‌ బచ్చన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అతిథులుగా హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావేడకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అమితాబ్‌, రజనీ 45వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ వేడుకల్లో ఒకేసారి కనిపించి, సందడి చేశారు.

ఈ సందర్భంగా అమితాబ్‌ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారట. సినీ రంగంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ఈ ఏడాది బిగ్‌బికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రజనీ ‘స్పెషల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ జూబ్లీ’ పురస్కారం అందుకోబోతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.