
తాజా వార్తలు
ఇలాంటి నీచమైన పనులు చేయనన్నాను: ఇషా కొప్పికర్
ముంబయి: ఓ నటుడు తనను ఒంటరిగా రమ్మన్నాడని ప్రముఖ నటి ఇషా కొప్పికర్ తెలిపారు. ‘చంద్రలేఖ’ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత ‘ప్రేమతో రా’ తదితర తెలుగు చిత్రాల్లో మెరిశారు. ఆపై తమిళం, కన్నడ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. బాలీవుడ్‌లోనూ అనేక చిత్రాల్లో నటించారు. ఇషా తాజాగా చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఓ సందర్భంలో కొందరు తనను అనుచితంగా తాకారని, ఆ తర్వాత ఆత్మరక్షణకు ఏం చేయాలో, ఇతరుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని చెప్పారు.
‘ఓ సినిమా కోసం నన్ను తీసుకోవాలి అనుకున్నారు. దీంతో నిర్మాత నాకు ఫోన్ చేసి.. ‘ఫలానా నటుడికి ఫోన్ చేయ్యి. అతడితో స్నేహంగా వ్యవహరించు. అప్పుడే నీకు గుర్తింపు వస్తుంది’ అన్నారు. నేను నటుడికి ఫోన్ చేశా. ఆయన తన పూర్తి టైం టేబుల్ చెప్పాడు. ఆ నటుడు తెల్లవారు జామునే నిద్రలేచి జిమ్‌కు వెళ్తారట. నన్ను కలవడానికి ఏ మాత్రం తీరిక లేదు అన్నట్లు మాట్లాడాడు. చివరికి ఓ రోజు నన్ను రమ్మన్నాడు. ‘నువ్వు ఎవరితో కలిసి వస్తున్నావు?’ అని అడిగాడు. నాతోపాటు డ్రైవర్ వస్తారని అన్నాను. ‘ఎవరినీ తోడు తీసుకుని రావొద్దు.. నువ్వు ఒక్కదానివే రా..’ అని చెప్పాడు. నాకు అతడి చెడు ఉద్దేశం అర్థమైంది. అందుకే ‘రేపు నేను ఖాళీగా లేను’ అని చెప్పేశా. ఆపై వెంటనే చిత్ర నిర్మాతకు ఫోన్ చేశాను. నటిగా నా నైపుణ్యం చూసి సినిమాకు తీసుకోవాలని, అంతేకాని పాత్ర కోసం ఇలాంటి నీచమైన పనులు చేయనని చెప్పా. దీంతో ఆ సినిమా నా చేజారిపోయింది. ఓ మహిళ ఇలా వ్యతిరేకించి మాట్లాడితే.. జనాలు తట్టుకోలేరు, స్వీకరించలేరు’ అని ఇషా పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
