
తాజా వార్తలు
హైదరాబాద్: ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన కఠోర సాధన చేస్తున్నారు. విదేశాలకు చెందిన బాక్సర్ ట్రైనర్ నుంచి బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘కిరణ్ కొర్రపాటి చిత్రంలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముంబయికి చెందిన ట్రైనర్ సారథ్యంలో బరువు తగ్గడానికి సాధన చేస్తున్నాను. బాక్సింగ్ ట్రైనింగ్ కోసం లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ట్రైనర్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పటివరకూ విభిన్న పాత్రల్లో నటించాను. కానీ మొదటిసారి ఇప్పుడు చేయబోయే పాత్ర కోసం నేను ఫిజికల్‌గా మారుతున్నాను.’ అని వరుణ్ తెలిపారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన కియారా అడ్వాణీ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను కలసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తెలుగులో విడులైన ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామా’ చిత్రాల్లో కియారా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
