
తాజా వార్తలు
కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మండ్య: కర్ణాటకలో అనర్హతకు గురైన ఎమ్మెల్యే ఒకరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనానికి దారితీశాయి. భాజపాకు మద్దతిస్తే తన నియోజకవర్గమైన కృష్ణరాజపేట్ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని యడియూరప్ప చెప్పారని, అన్నట్లుగానే సీఎం అయ్యాక ఆ నిధులను కేటాయించారని అనర్హత ఎమ్మెల్యే నారాయణ గౌడ అన్నట్లు సమాచారం.
‘‘ఒక రోజు(కుమారస్వామి ప్రభుత్వం కూలకముందు) ఉదయం 5 గంటలకు కొందరు వ్యక్తులు వచ్చి నన్ను యడియూరప్ప నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన పూజలో ఉన్నారు. తనకు మద్దతివ్వాలని, అలాగైతే తాను మళ్లీ సీఎం అవుతానని యడ్డీ అడిగారు. అప్పుడు నేను కృష్ణరాజపేట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 700 కోట్లు కేటాయించాలని కోరారు. అందుకు యడియూరప్ప మరో రూ. 300కోట్లు అదనంగా ఇస్తానని అన్నారు. ఆ తర్వాత(సీఎం అయ్యాక) మా నియోజకవర్గానికి రూ. 1000కోట్ల నిధులు కేటాయించారు. అలాంటి గొప్ప వ్యక్తికి నేను మద్దతివ్వాలా వద్దా? అందుకే ఆయనకు మద్దతు తెలిపాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనపై అనర్హత పడినా ఫర్వాలేదు అనుకున్నాను’ అని నారాయణ గౌడ తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్-జనతాదళ్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే వీరిలో చాలా మంది నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే తాము భాజపాకు మద్దతిచ్చినట్లు చెప్పారు. మరోవైపు అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంలో యడియూరప్ప మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ఆడియోను ఈ కేసులో విచారణాంశంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు నిన్న వెల్లడించింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
