close

తాజా వార్తలు

క్రికెట్‌పై అభిమానం.. ఇలానే ఉంటుంది మరీ!

దుబాయ్‌: క్రికెట్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని క్రీడల కంటే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారి దేశం మైదానంలో పోరాడుతుందంటే మ్యాచ్‌ను తప్పకుండా వీక్షిస్తుంటారు. అలానే, ఓ పాక్‌ అభిమాన జంట ఏకంగా తమ వివాహ వేడుక రోజు మ్యాచ్‌ను తిలకించి నెట్టింట పాపులర్‌ అయ్యారు. ఇంతకీ వారేం చేశారంటే.. అమెరికాలో స్థిరపడిన పాక్ అభిమాని హజన్‌ తస్లీమ్‌ పాక్×ఆసీస్‌ మ్యాచ్‌ రోజున పెళ్లి చేసుకున్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం పెళ్లికుమార్తెను ఇంటికి స్వాగతించారు. కానీ, ఆ సమయంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో వారు మ్యాచ్‌ను వీక్షిస్తూ కూర్చుండి పోయారు. క్రికెట్‌పై అభిమానంతో అందులో లీనమైపోయారు. ఈ ఫొటోను పెళ్లికుమారుడు ఐసీసీకి పంపించగా.. ‘కపుల్‌ గోల్స్‌’ అంటూ ఐసీసీ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో పాటు ‘క్రికెట్‌ లవర్స్‌గా’ పాపులర్‌ అయ్యారు. కాన్‌బెర్రా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో స్మిత్ (80*) చెలరేగడంతో పాక్‌పై ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.