
తాజా వార్తలు
హైదరాబాద్: ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలయ్యాక మహేశ్ కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ తెలిపారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘నిజమే.. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక మహేశ్ మూడు నెలలపాటు బ్రేక్ తీసుకోనున్నారు. ఈ బ్రేక్‌లో గౌతమ్, సితారతో సరదాగా గడపాలని ఆయన అనుకుంటున్నారు. అంతేకాకుండా తన తర్వాత సినిమా కోసం సన్నద్ధమవుతాడు. ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల కోసం ఆయన నిర్విరామంగా పనిచేస్తున్నారు. అందుకే కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో మహేశ్ మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.. దానితో పోలిస్తే ఇది చాలా చిన్న బ్రేక్. ఎటువంటి పనిఒత్తిడి లేకుండా హలీడేను ఎంజాయ్ చేయాలని ఆయన అనుకుంటుకున్నారు’ అని నమ్రతా పేర్కొన్నారు.
మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- కిల్లర్ శ్రీనివాస్‌నూ చంపేయండి!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
