close

తాజా వార్తలు

తెగించి వెళ్లిన మగాడి కోసం స్త్రీ కన్నీరు కార్చదు!

ఆకట్టుకుంటున్న ‘మామాంగం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: మమ్ముట్టి ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మలయాళ చిత్రం ‘మామాంగం’. 1680 కాలానికి చెందిన ఓ మహావీరుడి కథాంశంతో దర్శకుడు పద్మ కుమార్‌ ఈ సినిమాను తీస్తున్నారు. రాజా జామో అనే రాజు అరాచకాలకు వ్యతిరేకంగా సావేర్స్‌ అనే ఓ బృందం చేసిన పోరాటమే ఈ చిత్రం. మమ్ముట్టితో పాటు ఉన్ని ముకుందన్‌, సిద్ధిక్‌, మణికుట్టన్‌, కనిక, అను నటిస్తున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

శనివారం మధ్యాహ్నం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమౌతోంది. ‘‘మామాంగానికి వల్లువనాడు నుంచి ఇప్పటికీ ఒక్క వ్యక్తైనా వస్తున్నాడంటే.. ఆ ప్రతీకార జ్వాలలు ఇంకా మన వల్లువనాడు స్త్రీల మనసులో రగులుతూనే ఉన్నాయి కాబట్టి.. అటువంటి వారి కడుపునే నువ్వు, నేను జన్మించాం’ అని మమ్ముట్టి వివరిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘విజయం కోసం తెగించి వెళ్లిన ఏ మగవాడ్ని తలచుకుని.. వల్లువనాడులో ఏ ఆడది ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చదు. అలా జరిగితే అది ప్రళయం అవుతుంది’ అని ఓ నటి చెబుతున్నారు. ‘రావణుడిలాంటి అతడ్ని ఎదుర్కోవాలంటే ఒక మహాపురుషుడే అవతారం ఎత్తి ఉండాలి’ అని చెప్పడం కథపై ఆసక్తిని పెంచింది. ‘చావుకి సిద్ధంగా ఉండు’ అని చిన్న బాలుడు సైతం సవాలు చేయడం ఆకట్టుకుంటోంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.