close

తాజా వార్తలు

ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్‌..!

అలరిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ ట్రైలర్‌

హైదరాబాద్‌: యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ న‌టిస్తున్న సినిమా ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ (‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌). జి. నాగేశ్వర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక కథానాయిక. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, బ్రహ్మానందం, వెన్నెల‌ కిశోర్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబరు 15న విడుదల చేయబోతున్నారు.

శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫన్నీ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ‘సివిల్‌ కేసులు కాంప్రమైజ్‌ చేయొచ్చు.. క్రిమినల్‌ కేసులు కావు.. నేరస్థులకు శిక్ష పడాల్సిందే.. ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్‌..’ అంటూ సందీప్‌ న్యాయవాదిగా చక్కగా నటించారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.