
తాజా వార్తలు
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్ వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. టీంలోకి ఆమెకు స్వాగతం పలికింది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ‘బలుపు’, ‘డాన్ శ్రీను’ తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వరలక్ష్మి పలు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి సినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ఈ నెల 15న చిత్రం విడుదల కాబోతోంది. దీని తర్వాత వరలక్ష్మి తెలుగులో రవితేజ ప్రాజెక్టుకు సంతకం చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
