
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: వైద్య వృత్తంటేనే తీవ్రతతో కూడుకుంది. చికిత్స చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రత, అప్రమత్తత అవసరం. చిన్న పిల్లల విషయంలో అయితే మరీనూ. చిన్నారులతో మమేకం అయితే తప్ప వారికి చికిత్స చేయడం కష్టం. ఈ సూత్రాన్ని తూ.చా తప్పకుండా పాటించాడో వైద్యుడు. ఇంకా వినూత్నంగా ఆలోచించి పాటపాడుతూ ఆరోగ్య పరీక్షలు చేశాడు.
అమెరికాకు చెందిన షానోన్ వెమిస్ అనే మహిళ తన కూతుర్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లింది. నెలల వయసున్న ఆ చిన్నారికి రక్త పరీక్షలు చేయాల్సి వచ్చింది. రక్త నమూనా సేకరించేటప్పుడు చిన్నారికి నొప్పి కలగకుండా ఉండేందుకు డాక్టర్ రేయాన్ కోట్జీ వినూత్నంగా ఆలోచించాడు. పాట పాడుతూ రక్త నమూనా సేకరించాడు. రేయాన్ పాడుతుండగా ఆ చిన్నారి కూడా ఆయనవైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తల్లి షానోన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. వైద్యుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అలాంటి రోజు వస్తుందనుకోలేదు: అక్షయ్
- రివ్యూ: 90 ఎం.ఎల్
- చైతూ.. నన్ను కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పారు!
- ‘డిస్కోరాజా’ వచ్చేశాడు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- రివ్యూ: మిస్ మ్యాచ్
- రాయగలరా?
- ‘సల్మాన్ నుంచి అది నేర్చుకోవాలి’
- ఆ పూల హంగు ఈ చీర చెంగు!
- షోలాపూర్పై తెలుగింటి ముద్ర!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
