
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: విడుదలకు ముందే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలుండటం సహజం. వాటిలో కొన్ని మాత్రమే ఆ అంచనాలను అందుకుంటాయి. తాజాగా ‘జోకర్’ చిత్రం ఆ అంచనాలని కూడా దాటుకొని విజయం సాధించింది. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. ఆరు వేల కోట్ల వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు దిశగా వెళుతున్నట్టు ఫోర్బ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు విడుదలైన హాస్య నేపథ్యం ఉన్న చిత్రాల్లో ‘జోకర్’ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో జోక్విన్ ఫొనిక్స్ నటనతో పాటుగా హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం భారత్‌లో ‘వార్’, ‘సైరా’ చిత్రాలకు దీటుగా నిలబడి మల్టిప్లెక్స్ థియేటర్లలో రూ.50 కోట్లు వసూళ్లు చేయటం మరో విశేషం. ఈ చిత్రానికి టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
