
తాజా వార్తలు
కోడంబాక్కం, న్యూస్‌టుడే: సినిమాలో సత్తా ఉంటే.. ఎంతటి పోటీ ఉన్నా, ఎంత చిన్న చిత్రమైనా.. అది విజయం సాధిస్తుందనడానికి ఇటీవల కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రమే ఉదాహరణ. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయినా.. విజయ్‌తో కార్తికి పోటీ అవసరమా..? అని చెప్పినవారు లేకపోలేదు. ‘బిగిల్’ జోరులో ‘ఖైదీ’ కొట్టుకుపోతుందని అనుకున్న ప్రేక్షకులు ఉన్నారు. కానీ చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అంతేకాకుండా కార్తి కెరీర్లోనే అతిపెద్ద హిట్ చిత్రంగానూ నిలవడం విశేషం. ఈ చిత్రం రూ.40 కోట్లలోపు బడ్జెట్లో నిర్మితమైనట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తమిళనాడుతోపాటు ఇతర తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలోనూ లాభాలు తెచ్చిపెట్టినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలు సహా మొత్తం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తమిళనాట మాత్రమే ఈ చిత్రం రూ.50 కోట్లు సొంతం చేసుకుందని సమాచారం. దీంతో నిర్మాణ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
