
తాజా వార్తలు
ముంబయి: ‘నేను చిన్నారులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను’ అంటున్నారు బాలీవుడ్ నటి స్వరాభాస్కర్. తాజాగా ఆమె ఓ షోలో పాల్గొని చిన్నారిని దూషించారు. అంతేకాకుండా పిల్లలను దెయ్యాలతో పోల్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు స్వరా భాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారిని నిందించిన ఘటనపై ఆమె స్పందించారు. ‘నేను చిన్నారిని సరదాగా అన్నాను. ఎందుకంటే నేను పాల్గొన్నది ఒక కామెడీ షోలో. ముంబయిలో నా తొలి షూటింగ్ అనుభవాన్ని సరదాగా చెప్పాను. అక్కడ నేను కొంతమేర అసభ్య పదజాలాన్ని వాడాను. పెద్దవాళ్లకు అర్థమయ్యేలా హస్యాస్పదంగా ఆ మాటలను వాడానే కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు కనుక ఆ కామెడీ షోను చూస్తే నేనేంటో, నేనేమన్నానో ప్రతిఒక్కరికీ అర్థమవుతుంది. చిన్నారులంటే నాకిష్టం. వాళ్ల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ ముందు ఉంటాను. చిన్నారులను, నా సహనటులను కానీ నిందించలేదు. చిన్నారులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. చిన్నారులను దెయ్యాలతో పోల్చింది సరదాగానే’ అని స్వరా పేర్కొన్నారు.
ఇటీవల స్వరాభాస్కర్ ‘సన్ ఆఫ్ అభిష్’ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడిన ఒక వీడియో బయటకు వచ్చింది. దీనిలో తన కెరీర్ ఆరంభంలో ఘటనలను స్వరా చెప్పారు. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయంలో ఓ బాలనటుడు తనను ‘ఆంటీ’ అన్నాడని వెల్లడించారు. అదే కార్యక్రమంలో ఆ బాలుడిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడారు. అంతేకాకుండా పిల్లలను దయ్యాలతో పోల్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
