
తాజా వార్తలు
ఆ ఆఫీసులో బెడ్ ఉంది: నటి
ముంబయి: సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు తనకు విచిత్రమైన ఘటన ఎదురైందని బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ తెలిపారు. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించిన ‘ఉజ్డా చమన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు భామ. ఇందులో ఆమె బరువు ఎక్కువ ఉన్న అమ్మాయిగా కనిపించారు. బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి, అలరించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు అభిషేక్ పాథక్ సామాజిక సందేశాన్ని అందించారు.
తాజాగా మాన్వి ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ఓ ఆడిషన్స్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘గతంలో ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో నన్ను అత్యాచారయత్నం సన్నివేశంలో నటించమని అడిగారు. అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అక్కడి వాతావరణం చూసి భయంతో పరుగులు తీసుకుంటూ వచ్చేశా. ఆ గదిలో పడక మంచం ఉంది. దాన్ని వాళ్లు ఆఫీసు అని చెప్పుకోవడం విచిత్రం’ అని తెలిపారు.
మాన్వి టెలివిజన్ షో ‘ధూమ్ మచావో ధూమ్’తో 2007లో కెరీర్ ఆరంభించారు. ‘ట్రిప్లింగ్’, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ వెస్ సిరీస్‌లలో నటించారు. ‘ఉజ్డా చమన్’ తర్వాత కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘శుభ్ మంగళ్ జ్యదా సావ్ధాన్’ సినిమాలో నటిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
