
తాజా వార్తలు
స్థానిక రికార్డులను బద్దలుకొట్టిన నిక్ దంపతులు
లాస్ఏంజెల్స్: కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకుని గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ నటి ప్రియాంక, హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్. తాజాగా ఈ జంట లాస్ ఏంజెల్స్‌లోని స్థానిక ఎన్సినో ప్రాంతంలో రూ.144 కోట్ల (20మిలియన్ డాలర్లు) విలువైన ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేసి స్థానిక రియల్ ఎస్టేట్ రికార్డులను ఈ జంట కొల్లగొట్టినట్లు లాస్ ఏంజెల్స్‌లోని ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. 20 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ ఇంట్లో 7 పడక గదులు, 11 బాత్ రూమ్‌లు ఉన్నాయట. అంతేకాకుండా ఇంటిముందు విశాలమైన మైదానం కూడా ఉందట. మరోవైపు నిక్ సోదరుడు జోయీ జోనాస్ సైతం 14.1 మిలియన్ డాలర్ల విలువైన ఓ నివాస గృహాన్ని కొనుగోలు చేశారు. నిక్ నివాసానికి కొన్ని అడుగుల దూరంలోనే జోయీ నివాసం ఉంటుంది. 15 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ నివాసంలో 10 పడకగదులు, 14 బాత్ రూమ్‌లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
లాస్ ఏంజెల్స్‌లో ఓ ఖరీదైన, విలాసవంతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే తమ డ్రీమ్ అని ప్రియాంక-జొనాస్ చాలాసార్లు తెలిపారు. ఇందుకోసం నిక్ ఆగస్టులో తన బ్యాచ్‌లర్ పాడ్‌ను కూడా అమ్మేసాడు. ఇటీవల విడుదలైన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి ప్రియాంక చోప్రా. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ ఓ వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితకథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రియాంక ‘ది వైట్ టైగర్’లో నటిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
