close

తాజా వార్తలు

ఆ ఇద్దరు ఎవరు?.. బన్నీ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారట. ఆయన నటిస్తున్న సినిమా ‘అల.. వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ గీతాలకు సోషల్‌మీడియాలో విశేషమైన ఆదరణ లభించింది. కాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14న విడుదల చేయబోతున్నట్లు బన్నీ బుధవారం ప్రకటించారు. ‘ఓమైగాడ్‌ డాడీ..’ అని సాగే ఈ గీతం టీజర్‌ను ఉదయం 10 గంటలకు షేర్‌ చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ వీడియోతోపాటు అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఉండబోతోందని ట్వీట్‌ చేశారు. పాటలో బన్నీతోపాటు ఇద్దరు ప్రత్యేకమైన అతిథులు కనిపించబోతున్నారట. అయితే వాళ్లు ఎవరో కాదు అల్లు వారసులు అయాన్‌, అర్హలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, జయరామ్‌, సుశాంత్‌, టబు, నవదీప్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.