
తాజా వార్తలు
వీడియో షేర్ చేసిన సుధీర్‌బాబు
హైదరాబాద్: కథానాయకుడు సుధీర్‌బాబు ఓ పక్క ‘వి’ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోపక్క పుల్లెల గోపీచంద్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం సుధీర్, నాని నటిస్తున్న సినిమా ‘వి’. నివేదా థామస్, అదితిరావు హైదరి కథానాయికలు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
కాగా మరోపక్క సుధీర్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న ఈ చిత్రం కోసం సుధీర్ సిద్ధమౌతున్నారు. రోజూ బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు. స్వతహాగా పుల్లెల గోపీచంద్ జీవితాన్ని, ఆయన ఆటని దగ్గర్నుంచి చూశారు. ఆ అనుభవంతోనే ఆయన పాత్రని రక్తి కట్టించేందుకు మైదానంలోకి దిగి సాధన చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ నేపథ్యంలో ‘వి’ షూట్ విరామంలో సుధీర్ బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘వి’ విరామం షెడ్యూల్ పుల్లెల గోపీచంద్ షెడ్యూల్ సాధనకు ఉపయోగపడుతోందని అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఉతికి ఆరేశారు
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
