close

తాజా వార్తలు

తమిళం నేర్చుకోవడం కష్టంగా ఉంది: కంగనా

కంగనా

కోడంబాక్కం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హిందీ నటి కంగనా రనౌత్‌.. జయలలిత పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అంతకుముందు దాదాపు నాలుగు నెలల పాటు నిర్మాణ పూర్వ పనులకే పెద్దపీట వేసింది చిత్ర బృందం. ఈ సినిమా కోసం ఆమె కొంత బరువు పెరిగినట్లు సమాచారం. జయలలిత యాస, హావభావాలను నేర్చుకున్నారట కంగనా. ఇక భాష గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ ‘తమిళం నేర్చుకోవడం చాలా శ్రమతో కూడిన విషయం. కష్టంగా ఉంది. అయినా నేర్చుకుంటున్నా. చాలా డైలాగులను కంటస్తం చేస్తున్నా. డైలాగులే ఈ చిత్రానికి మరింత కీలకం కానున్నాయి. గతంలోనే తమిళం నేర్చుకోవాలని ఆశ పడ్ఢా కానీ కుదరలేదు. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకు తమిళం చాలా ముఖ్యం. ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతోందని’ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.