
తాజా వార్తలు
చండీగర్: బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొణె-రణవీర్‌సింగ్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. గురువారం తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దీప్‌వీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ జంట తమ కుటుంబసభ్యులతో కలిసి పంజాబ్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏడేళ్లపాటు ప్రేమించుకుని గతేడాది నవంబర్ 14న దీపిక-రణవీర్ వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగింది.
వివాహం జరిగిన తర్వాత దీపిక-రణవీర్ కలిసి నటించిన చిత్రం ‘83’. కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణవీర్ కపిల్‌దేవ్ పాత్రలో కనిపించనున్నారు. కపిల్ భార్య రోమీభాటియా పాత్రలో దీపిక నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దీపిక ‘చఫాక్’ చిత్రంలో నటించారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
