close

తాజా వార్తలు

‘మీటూ’ఆరోపణలపై పెదవి విప్పిన అనూమాలిక్‌

ముంబయి: తనపై వస్తున్న ‘మీటూ’ ఆరోపణలపై ప్రముఖ సంగీత దర్శకుడు‌, ఇండియన్‌ ఐడిల్‌ న్యాయ నిర్ణేత అనూ మాలిక్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తమైనవని ఆయన పేర్కొన్నారు. తమను లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారి గురించి సినీతారలు ‘మీటూ’ ఉద్యమంలో గళమెత్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది అనూ మాలిక్‌ తమను లైంగికంగా వేధించారని సింగర్స్‌ సోనా మొహాపత్రా, శ్వేతా పండిత్‌ సోషల్‌మీడియా వేదికగా ఆరోపించారు. వీరిద్దరి తర్వాత మరికొంతమంది గాయనిలు సైతం అనూ మాలిక్‌పై  ఇదే తరహా ఆరోపణలు చేశారు. దీంతో ఇండియన్‌ ఐడిల్‌ కార్యక్రమం నుంచి సదరు ఛానెల్‌ వారు ఆయన్ను గతేడాది తప్పించింది. అయితే ప్రస్తుతం ఆయన ఇండియన్‌ ఐడిల్‌ సీజన్‌11కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్‌ సోనా మొహాపత్రా.. అనూ మాలిక్‌ ప్రవర్తన గురించి ఆరోపణలు చేశారు. ఆయనో నీచమైన వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు.

దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై అనూ మాలిక్‌ ఎట్టకేలకు సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘గతేడాది నుంచి చేయని తప్పునకు నేను మాటలు పడుతున్నాను. ఏదో ఒకరోజు నిజం దానంతట అదే బయటకు వస్తుందనే నమ్మకంతోనే నేను ఇన్నిరోజులు నాపై వస్తున్న లైంగిక ఆరోపణల గురించి మాట్లాడలేదు. మౌనంగా ఉండడమే నేను చేసిన తప్పని నాకు అర్థమయ్యింది. ఇలాంటి అసత్య ఆరోపణల వల్ల నా గౌరవం దెబ్బతినడమే కాకుండా నా కుటుంబం కూడా మానసికంగా ఎంతో బాధపడుతోంది. ఆరోపణల వల్ల నేను నిస్సహాయతకు గురయ్యాను. ఈ వయసులో నా గురించి ఎన్నో అసభ్యకర మాటలను నేను వింటున్నాను. నా గురించి ఆరోపణలు చేసినవారు ముందే ఎందుకు మాట్లాడలేదు? నేను మళ్లీ న్యాయనిర్ణేతగా అయ్యాకే ఎందుకు నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ప్రస్తుతం నాకు ఉన్న జీవనాధారం అదే. ఇద్దరు కుమార్తెలకు తండ్రిగా ఉండి ఇటువంటి ఆరోపణలపై నేను మాట్లాడలేకపోతున్నాను. ఇలాగే జరిగితే నేను కోర్టును ఆశ్రయించక తప్పదు. ఇలాంటి కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా కృతజ్ఞతలు’ అని అనూ మాలిక్‌ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.