close

తాజా వార్తలు

పాతకాలం లుక్‌లో వెంకీ, పాయల్‌

‘వెంకీమామ’ నుంచి రెండో పాట విడుదల

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌ పుత్‌ కథానాయికలు. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాటను చిత్రబృందం శనివారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. 1980 కాలం నాటి రోజుల్ని గుర్తు చేసే పాట ఇది. ‘ఈ ముల్లు ఏదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే..’ అని నాగచైతన్య చెప్పే డైలాగ్‌తో ఈ పాట మొదలవుతుంది. ‘ఎన్నాళ్లకో.. ఎన్నేళ్లకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు పట్టెరో. ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసరో..’ అంటూ సాగే ఈ పాటలో వెంకటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ పాతకాలం లుక్‌లో కనిపించారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘మామా అలుళ్ల కథ ఇది’ అంటూ సాగే టైటిల్‌ గీతం ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.