
తాజా వార్తలు
‘తంబి’ పోస్టరు
కోడంబాక్కం, న్యూస్టుడే: తొలిసారి జ్యోతిక, కార్తి కలిసి నటించిన చిత్రం ‘తంబి’. ఇందులో అక్క, తమ్ముడి పాత్రలో నటించినట్లు సమాచారం. అందుకే ఈ సినిమాకు ‘తంబి’ (తమ్ముడు) అని పేరు పెట్టారు. 2006లో మాధవన్ హీరోగా నటించిన చిత్రం ‘తంబి’. ఆ సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. కథకు తగ్గట్లు ఉన్నందునే ఈ పేరును ఎంచుకున్నట్లు సమాచారం. మరోవైపు నటుడు కార్తి.. మెగాస్టార్ చిరంజీవి టైటిళ్లపై దృష్టిపెట్టినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దీపావళికి విడుదలైన ‘ఖైదీ’.. చిరంజీవి గతంలో తీసిన సినిమా పేరే. ఇప్పుడు ‘తంబి’ చిత్రానికి తెలుగులో ‘దొంగ’ అని పేరు పెట్టారు. అది కూడా చిరంజీవి 1985లో నటించిన సినిమా కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం కార్తి ఎక్కువగా శ్రమించినట్లు తెలుస్తోంది. రొటీన్ చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని, సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని కార్తి అంచనాలు పెంచుకున్నారు. అంతేకాకుండా మరో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
