
తాజా వార్తలు
ముంబయి: తనపై ఓ జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ బుల్లితెర నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందీలో ప్రసారమయ్యే పలు రియాల్టీషోలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమెకు కొంతకాలం క్రితం హరియాణాలోని యమునానగర్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయమైంది. వీరిద్దరు పలు రియాల్టీ షోల కోసం కలిసి పనిచేశారు. అయితే అక్టోబర్ 13న పార్టీ పేరు చెప్పి ఆ ఆర్టిస్ట్ తనను హోటల్‌కు తీసుకువెళ్లాడని, అనంతరం డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను గర్భవతినని.. వెంటనే పెళ్లి చేసుకోవాలని అడగ్గా అతను నిరాకరించాడని, ఆరోజు నుంచి కనిపించడం లేదని నటి తెలిపారు. అతని తల్లిదండ్రులకు అన్నీ విషయాలు తెలిసినా వాళ్లు తనకి ఎటువంటి సాయం చేయడం లేదని ఆమె పేర్కొన్నారు. నటి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
