close

తాజా వార్తలు

‘అలాంటి వేషాలు వేసే నయన్‌కు సీత పాత్రా?’

2011 నవంబరు 17, అంటే నయనతార పుట్టినరోజుకు ఒక రోజు ముందు వరకూ ఆమె కేవలం ఒక గ్లామరస్‌ హీరోయిన్‌గా మాత్రమే చిత్ర పరిశ్రమకు పరిచయం. హీరో పక్కన నాలుగు ప్రేమ సన్నివేశాలు, అయిదు పాటలు ఆడి పాడే హీరోయిన్‌గా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. అలాంటి నయనతారకు ‘శ్రీరామ రాజ్యం’లాంటి ఇతిహాస గాథలో పాత్ర? అదీ సీతాదేవిగానా? పవిత్రమైన ఆ పాత్రకు నయన్‌ను ఎందుకు తీసుకున్నారు? అసలు దర్శక-నిర్మాతలకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఇది అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మెదిలిన ప్రశ్నలు.. అనుమానాలు. కానీ, ‘శ్రీరామ రాజ్యం’ విడుదలైన రోజున ఆ ప్రశ్నలకు జవాబు వెండితెరపై లభించింది. అనుమానాలు పటాపంచలయ్యాయి. అక్కడి నుంచి నయనతారను ఆరాధించడం మొదలు పెట్టారు. ఆమెలో ఓ దేవతను చూశారు. ఎంతలా అంటే, అంజలీ దేవి తర్వాత సీతాదేవి అంటే నయనతారే అన్న స్థాయిలో ఆమె మెప్పించారంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది. అయినా, నేటికీ ఆ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. సోమవారం నయనతార పుట్టినరోజు. ఇలాంటి అరుదైన పాత్రల్లో నయన్‌ నటించి మెప్పించాలని కోరుకుంటూ.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, వివిధ సందర్భాల్లో ఆమె పంచుకున్న విశేషాలు మీకోసం..

యనతార నవంబరు 18, 1984లో బెంగళూరులో పుట్టింది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్‌. తల్లిదండ్రులు ఒమానా కురియన్‌, కురియన్‌ కొడియట్టు. 

వెండితెరపై ఆమె కనిపించిన మొదటి సినిమా మానసినక్కరే(2003)లో విడుదలైంది. తెలుగు తెరపై తొలిసారి కనిపించింది మాత్రం ‘చంద్రముఖి’ చిత్రంతోనే!

తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది నయన్‌. ‘లక్ష్మీ’, ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘ఆంజనేయులు’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో గ్లామరస్‌ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 


 

2010లో ‘సింహా’తో నటిగా హుందా అయిన పాత్రలో నటించిన అలరించిన నయనతార ఆ తర్వాత ఏడాది ‘శ్రీరామ రాజ్యం’లో సీతగా మెప్పించారు. అక్కడి నుంచి ఆమెకు కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు, కథానాయకుడికి సమానంగా పాత్రలు రావడంతో మొదలయ్యాయి. 

టు అగ్ర కథానాయకులతో నటిస్తూనే, ఇటు యువ కథానాయకుల సరసనా నటిస్తూ మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మెప్పించి లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. 

ఇండస్ట్రీలో ఉన్న కథానాయికల్లో అత్యధికంగా రూ.కోటి పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఏకంగా రూ.6కోట్లు తీసుకుంటున్నారట.

చిత్ర పరిశ్రమలో 15ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న నయన్‌ టాలెంట్‌ను నమ్మి సినిమా మొత్తాన్ని ఆమె భుజాలపైనే వేసి నడిపించాలనుకునే దర్శకులు ఎందరో ఉన్నారు.

‘‘నేను షూటింగ్స్‌తో బిజీగా ఉంటాను. నాకు పనిపట్ల అంకితభావం ఎక్కువ. ఇతర విషయాలను అంతగా పట్టించుకోను. సినిమాల్లో విజయం సాధించి అగ్రకథానాయికను అయినంత మాత్రాన వేరేవాళ్లలాగా నాకు గర్వం రాలేదు. నిజం చెప్పాలంటే నాకు భయం పెరిగింది. ఏ పాత్రలో నేను సరిగ్గా నటించలేనో అనే భయంతో జీవిస్తున్నాను’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘‘ఎన్నికష్టాలు ఎదురైనా ఎంత నష్టం వాటిల్లినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ముందుకు సాగుతూ పోవాలి. మన పని మనం చేసుకోవాలే తప్ప అనవసర విషయాలు గురించి మాట్లాడకూడదు’’

‘‘వేసుకునే డ్రస్సుల్లోనే గ్లామర్‌ ఉంటుందంటే నేను నమ్మను. చీరలో తక్కువ మేకప్‌లో కూడా అందంగా కనిపించవచ్చు. మన మనసు, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే అందంగా కనపడతాం. మనసులో అలజడి, ఆలోచనల్లో గందరగోళం ఉంటే ముఖానికి ఎంత మేకప్‌ వేసుకున్నా ఫలితం ఉండదు’’

‘‘సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటా. వాటిల్లో నాకు ఖాతాలు లేవు. అసలు జనాల్లోకి వెళ్లడం నాకు అంతగా నచ్చదు. అందుకే నా సినిమా ప్రమోషన్లయినా దూరంగా ఉంటాను’’

‘‘నమ్మకం లేని చోట ప్రేమ నిలవలేదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదనుకున్నా. ఆ సమయంలో నా సినిమాలే నాలో ధైర్యాన్ని నింపాయి.’’

ప్రస్తుతం నయనతార.. రజనీకాంత్‌ కథానాయకుడిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దర్బార్‌’లో నటిస్తున్నారు. దీంతో పాటు ‘నేట్రికన్‌’, ‘మూకుట్టి అమ్మాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.