close

తాజా వార్తలు

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో అతికష్టమైన ప్రశ్నలివే

ముంబయి: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’.. హిందీలో పేరుపొందిన రియాల్టీ షో. ఇందులో పాల్గొన్న కొందరు లక్షాధికారులైతే, మరికొందరు కోటీశ్వరులు అయ్యారు. హిందీలో ప్రసారమయ్యే ఈ షో ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందంటే తెలుగులో సైతం ఈ కార్యక్రమాన్ని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో నిర్వహించారు. అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న ఈ షో ప్రస్తుతం 11వ సీజన్‌ జరుగుతుంది. అయితే ఈషోలో బిగ్‌బి అడిగే ప్రశ్నలకు అటు కంటెస్టెంట్‌తోపాటు ఇటు టీవీ ముందు కూర్చున్న వీక్షకులు కూడా ఉత్సుకతతో సమాధానం చెబుతారు. కొందరు కంటిస్టెంట్స్‌ బిగ్‌బి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంటి బాటపట్టారు. అలా కంటిస్టెంట్స్‌ను ఇంటిబాట పట్టించిన అతి కష్టమైన పది ప్రశ్నలు ఎంటో తెలుసా..

‘మూడు సాకర్‌ క్లబ్‌ల పేర్లు ఏంటి?

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ సీజన్‌-11లో రూ.7కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇంటికి చేరిన వ్యక్తి గౌతమ్‌కుమార్‌ ఝా. బిగ్‌బి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గౌతమ్‌ రూ.కోటితో షోను నిష్క్రమించాడు. ఇంతకీ బిగ్‌బి అడిగిన ఆ ప్రశ్న ఏమిటంటే.. 

1.‘20వ శతాబ్దంలో డర్బన్‌, ప్రెటోరియా, జోహన్నస్‌బర్గ్‌ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ సాయంతో ఏర్పాటు చేసిన మూడు సాకర్‌ క్లబ్‌ల పేర్లు ఏమిటి?  
A.ట్రూత్‌ సీకర్స్‌       B.నాన్‌ వైలెంట్స్‌
C.ప్యాసివ్‌ రెసిస్టర్స్‌    D.నాన్‌ కోపరేటర్స్‌

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: ప్యాసివ్‌ రెసిసర్ట్స్‌

ఆ రాష్ట్రం ఏది?

ఈ సీజన్‌లో రూ.కోటితో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ నుంచి నిష్క్రమించిన మరో వ్యక్తి బబితా. ఆమెకు సరైనా సమాధానం తెలిసినా కూడా రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేక రూ.7 కోట్ల ప్రశ్న వద్ద షో నుంచి వెనుదిరిగారు. ఇంతకీ బిగ్‌బి ఆమెను అడిగిన ప్రశ్న ఏమిటంటే..

2.‘ఏ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది గవర్నర్‌లు మన దేశానికి రాష్ట్రపతులు అయ్యారు?’
A. రాజస్థాన్‌      B. బిహార్‌
C. పంజాబ్‌      D. ఆంధ్రప్రదేశ్‌

ఈ ప్రశ్నకు సమాధానం: బిహార్‌

భారతీయ బౌలర్‌ ఎవరు?

ఈ సీజన్‌లో రూ.ఏడు కోట్ల ప్రశ్న నుంచి వెనుదిరిగిన మొట్టమొదటి వ్యక్తి సనోజ్‌ రాజ్‌. ఇంతకీ రాజ్‌ సమాధానం చెప్పలేకపోయిన ఆ ఏడు కోట్ల ప్రశ్న ఏమిటంటే..
3.‘ఏ భారతీయ క్రికెటర్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ క్రికెట్‌ లెజెండ్‌గా పేరుపొందిన బ్రాడ్‌మన్‌ సింగిల్‌ చేసి తన 100వ సెంచరీని పూర్తి చేశాడు?’
A.జిలానీ           B.రంగాచారి
C.కిషన్‌చంద్‌        D.కన్వర్‌రాయ్‌ సింగ్‌

ఈ ప్రశ్నకు సమాధానం: కిషన్‌చంద్‌

‘రౌజా-ఇ-మునవ్వార్‌’ అంటే ఏమిటి?

బిగ్‌బి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రూ.25 లక్షలతో ఇంటికి చేరుకున్న యువతి దివ్య. ఇందులో ఆమెను అడిగిన రూ.50లక్షల ప్రశ్న ఏమిటంటే..
4.‘‘రౌజా-ఇ-మునవ్వార్‌’ పేరుతో గుర్తిండిపోయే మొఘల్‌  నిర్మాణాలు ఏవి?’
A. షాలీమర్‌ బాగ్‌                B. చిని కా రౌజా
C. హుమాయూన్‌ సమాధి        D. తాజ్‌ మహల్‌

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: తాజ్‌ మహల్‌

హిరణ్యకశిపుడి భార్య పేరేమిటి?

ఉషా యాదవ్‌.. 14వ ప్రశ్నకు సమాధానం చెప్పలేక  రూ.25 లక్షలతో షో నుంచి నిష్క్రమించారు. ఆమెను బిగ్‌బి అడిగిన రూ.50లక్షల ప్రశ్న ఏమిటంటే..
5.‘మన పురాణాల ప్రకారం.. హిరణ్యకశిపుడి భార్య, ప్రహ్లాదుడి తల్లి పేరు ఏమిటి?’
A. కపింజల          B. కయధు
C. కమలాక్షి          D. కౌషికి

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: కయధు

రావణుడా? లేక విభీషణుడా?

ఈ సీజన్‌లో రూ.12.50లక్షలతో ఇంటికి పయనమైన వ్యక్తి అఖిలేష్‌ కుమార్‌. రూ.25లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆయన షో నుంచి నిష్క్రమించాడు. ఆ ప్రశ్న ఏమిటంటే..

6.‘పురాణాల్లోని ఏ వ్యక్తి పేరును శ్రీలంక తన మొదటి శాటిలైట్‌కు పెట్టింది?’
A. కుబేరుడు           B. బుద్ధుడు
C. విభీషణుడు         D. రావణుడు

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: రావణాసురుడు

నోబెల్‌ బహుమతి.. ఆ శాస్ర్తం ఏది?

ఈ సీజన్‌లో బాగా ఆడిన మహిళ నమితా రౌత్‌. ఆమె రూ.12.50 లక్షలతో షో నుంచి ఇంటికి వెళ్లారు. ఇంతకీ ఆమె వదులుకున్న రూ.25 లక్షల ప్రశ్న ఏమిటంటే..
7.‘మొదలు పెట్టినప్పటి నుంచి  విరామం లేకుండా నోబెల్‌ బహుమతి ఇస్తున్న శాస్త్రం ఏది?’
A. రసాయన శాస్ర్తం         B. భౌతిక శాస్ర్తం 
C. శాంతి                  D. ఆర్థిక శాస్ర్తం

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: ఆర్థిక శాస్ర్తం

రాష్ట్రపతిగా మారిన డిప్యూటీ ఛైర్మన్‌ ఎవరు?

సన్నీ ప్రజాపతి రూ.25లక్షల ప్రశ్న వద్ద షో నుంచి తప్పుకున్నారు. ఆయన రూ.12.50 లక్షలతో ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఆయన సమాధానం చెప్పలేకపోయిన ఆ ప్రశ్న..
8.‘రాష్ట్రపతైన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎవరు?
A. వరాహగిరి వెంకటగిరి         B. ప్రతిభా పాటిల్‌
C. జాకీర్‌ హుస్సేన్‌             D. శంకర్‌ దయాల్‌ శర్మ

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: ప్రతిభా పాటిల్‌

మొదటి డైరెక్టర్‌ ఎవరు?

రూ.25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇంటికి వెళ్లిపోయిన వ్యక్తి మాధురి. ఆమె రూ.12.50 లక్షలను గెలుచుకున్నారు. ఆమె వదిలేసిన ఆ ప్రశ్న.. 
9.‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు)కు మొదటి భారత డైరెక్టర్‌ ఎవరు?’
A. దోరాబ్జి టాటా                 B. సీవీ రామన్‌
C. హోమీ జహంగీర్‌ భాభా        D. సతీశ్‌ ధావన్‌

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: సీవీ రామన్‌

శాస్ర్తవేత్త ఎవరు?

సంగీత కుమారి అనే మహిళ రూ.12.50లక్షలతో షో నుంచి వైదొలిగారు. ఆమె రూ.25లక్షల ప్రశ్న వద్ద షో నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఇంతకీ ఆమె సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న ఏమిటంటే..
10.‘ఈ కింది శాస్ర్తవేత్తల్లో ఎవరి పేరును పిరియాడిక్‌ టేబుల్‌లో కెమికల్‌ ఎలిమెంట్‌కు పెట్టలేదు?’
A. అల్బార్ట్‌ ఐన్‌స్టిన్‌          B. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌
C. థామస్‌ ఎడిసన్‌          D. ఎర్నికో ఫెమ్రీ

ఈ ప్రశ్నకు సరైన సమాధానం: థామస్‌ ఎడిసన్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.