close

తాజా వార్తలు

షారుక్‌ కుమార్తె నటనకు ఫ్యాన్స్‌ ఫిదా!

లఘు చిత్రం విడుదల

ముంబయి: బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ నటిగా కెరీర్‌ ఆరంభించారు. ఆమె ‘ది గ్రే పార్ట్‌ ఆఫ్‌ బ్లూ’ అనే లఘు చిత్రంలో నటించారు. పది నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో ఆమెతోపాటు నటుడు రోబిన్‌ గొనెల్ల కనిపించారు. ఇందులో ఇద్దరు యువ జంట జీవితం గురించి చూపించారు. వారి రెండు రోజుల రోడ్డు ట్రిప్‌ ఎలా గడిచిందనేదే లఘు చిత్రం కథ. ఈ లఘు చిత్రంలో సుహానా హావభావాలు, నటనా నైపుణ్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు థియోడర్ గిమెనో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఈ ప్రాజెక్టును చివరికి మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఏడాదిగా ఈ లఘు చిత్రం కోసం పనిచేస్తున్నా. ఇలాంటి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది’ అని పేర్కొన్నారు.

సుహానా ఇంగ్లాడ్‌లోని ఆర్డింగ్లీ కళాశాలలో చదువుకుంటున్నారు. గత ఏడాది సుహానా రోమియో-జూలియట్‌ నాటకంలో నటించారు. ఆ సందర్భంగా షారుక్‌ కూడా మెచ్చుకున్నారు, గర్వంగా ఫీల్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు నటిగా పరిచయం కావడానికి సిద్ధమౌతున్నట్లు వదంతులు వస్తున్నాయి.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.