close

తాజా వార్తలు

సుమంత్‌ ‘కపటధారి’

హైదరాబాద్‌: సుమంత్‌ కథానాయకుడిగా రూపొందుతున్న కన్నడ రీమేక్‌ చిత్రానికి చిత్రబృందం టైటిల్‌ ఖరారు చేసింది. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో డా.జి.ధనుంజయన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కపటధారి’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి టైటిల్‌, పాత్రలను పరిచయం చేస్తున్న వీడియోను ప్రముఖ కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు. కన్నడలో ‘కావలూడారి’కి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మించారు. డా.ధనుంజయన్‌ తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుమంత్‌ సరసన నందిత శ్వేత, పూజాకుమార్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోనీతో ‘భేతాళుడు’ తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రవర్గాలు ఇది వరకే ప్రకటించాయి. నాజర్‌, జయప్రకాష్‌, సంపత్‌ తదితరులు నటిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.