close

తాజా వార్తలు

12 ఏళ్ల తర్వాత వస్తున్న యమదొంగ


‘యమదొంగ’ పోస్టరు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న ‘యమదొంగ’ చిత్రం దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళంలోకి అనువాదం అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఈ చిత్రం 2007లో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌ కథానాయికలుగా నటించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. శివాజి గణేశన్‌ నటించిన ‘యమనుక్కు యమన్‌’, రజనీకాంత్‌ నటించిన ‘అదిశయ పిరవి’ తరహాలో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘విజయన్‌’గా అనువాదం అవుతోంది. ప్రముఖ రచయిత ఏఆర్‌కే రాజరాజ మాటలు, పాటలు రాశారు. సుదిక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై ఈ చిత్రం విడుదలవుతోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.