
తాజా వార్తలు
గుడ్ మార్నింగ్ హైదరాబాద్.. నేను మీ ఆర్జే నాని అంటూ శ్రోతల్లో హుషారెత్తించారాయన. ఇప్పుడు ఆయన పేరుకు పరిచయమే అవసరం లేదు. వరుస సినిమాలు, విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆర్జేగా మొదలైన ఆయన ప్రయాణం.. నేడు ప్రేక్షకులతో ‘నేచురల్ స్టార్’ అనిపించుకునే స్థాయికి చేరింది. దర్శకుడు కావాలనే డ్రీమ్‌తో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాని కొన్ని సినిమాలకు పనిచేశారు. ఆపై నటుడి అవతారం ఎత్తారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఆయన అసలు పేరు నవీన్ బాబు గంటా. ఈ మధ్య నాని సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాల్లోని కొన్ని విశేషాలు చూసేద్దాం..
ఫాలోవర్స్
2012 జులై 10న నాని ఫేస్బుక్ ఖాతాను ప్రారంభించారు. ఆయన పేజ్‌ను 4,694,058 మంది లైక్ చేశారు. 4,679,169 మంది ఫాలో అవుతున్నారు.
2012 ఫిబ్రవరిలో ట్విటర్లో అడుగుపెట్టారు. ఆయన్ను 3.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నాని 43 మందిని ఫాలో అవుతున్నారు.
నాని ఇన్‌స్టాగ్రామ్‌ను 1.8 మిలియన్ల మంది అనుసరిస్తుండగా.. ఆయన 18 మందిని ఫాలో అవుతున్నారు.
తొలి పోస్ట్ ఇదే..
2013 డిసెంబరు 3న నాని ఇన్‌స్టాలో తొలి పోస్ట్ చేశారు. తన సెల్ఫీని షేర్ చేస్తూ ‘న్యూఎంట్రీ’ అని కామెంట్ పెట్టారు. ఈ ఫొటోను 18 వేల మంది లైక్ చేశారు.
తనే అంజనా..
నాని తన సతీమణి అంజనాను ఉద్దేశిస్తూ ఓ సరదా పోస్ట్ చేశారు. అందులో ఓ పాప భావోద్వేగాల్ని బొమ్మల రూపంలో వేశారు. సోమవారం నిరాశతో రోజు ప్రారంభం కావడం.. అలా శుక్రవారం, శనివారం నాటికి ఉత్సాహంగా ఉండటం.. ఆదివారం రాత్రి కన్నీరు పెట్టుకోవడం చూపించారు. అంజనా ఫీలింగ్ కూడా ఇదేనంటూ నాని చేసిన ఆ పోస్ట్ నవ్వించింది.
అక్కా.. నేనూ
తన సోదరితో కలిసి చిన్నతనంలో తీసుకున్న ఫొటోను నాని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ‘అక్క, నేనూ..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో నాని క్యూట్‌గా ఉన్నారని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. 23 వేల మందికిపైగా ఈ ఫొటోను లైక్ చేశారు.
సిరి.. డార్లింగ్
నానికి తన మేనకోడలంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పాపతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘సిరి.. నా డార్లింగ్.. నా మేనకోడల్ని మిస్ అవుతున్నా’ అని పోస్ట్ చేశారు.
నా తొలి ఫ్రెండ్..
‘రాధాగోపాళం’ సినిమాకు నాని క్లాప్‌బాయ్‌గా పనిచేశారు. ఈ సినిమా క్లాప్‌బోర్డు ఫొటోను ఆయన షేర్ చేస్తూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘నా తొలి క్లాప్ బోర్డు.. నేను ఈ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత నా తొలి స్నేహితుడు..’ అని కామెంట్ చేశారు.
తండ్రితో..
ఫాదర్స్‌డే సందర్భంగా నాని తొలిసారి తన తండ్రి ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. నాన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అందులో నాని పెళ్లికి ఆయన తండ్రి బాసికం కడుతూ కనిపించారు.
మణిరత్నం ఆదర్శం..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తనకు ఆదర్శమని నాని అనేక మార్లు తెలిపారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, మణిరత్నంతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘చాలు.. ఇంక చాలు..’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు ఫ్యాన్‌బాయ్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఆయన తన గురువని, స్ఫూర్తని తెలిపారు.
ఇష్టమైంది..
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా మణిరత్నం రూపొందించిన ‘దళపతి’ నాని ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ విషయాన్ని ఆయనే పంచుకున్నారు. నవంబరు 6న ఈ సినిమా విడుదల సందర్భంగా నాని ఓ పోస్ట్ చేశారు. ‘‘దళపతి’కి 25 ఏళ్లు. నాకు ఎంతో ఇష్టమైన చిత్రం’ అని పేర్కొన్నారు.
తాతతో చిట్టి నాని..
చిన్నతనంలో తన తాతయ్యతో ఉన్న ఫొటోను నాని ఓసారి షేర్ చేశారు. ‘ఒకానొక సందర్భంలో.. చిట్టి తాతయ్య.. నేను’ అని కామెంట్ చేశారు. ఈ ఫొటోను 44 వేల మంది లైక్ చేశారు.
హాలు నిండినది
‘అష్మాచమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమై నాని హిట్ అందుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఓ థియేటర్ దగ్గర తీసుకున్న ఫొటోను ఆయన సెప్టెంబరు 5న షేర్ చేశారు. ‘తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున నా కుటుంబం పరిధి విస్తరించడం మొదలైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా అది పెరుగుతూనే ఉంది. నన్ను మీ వాడిగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు’ అని కామెంట్ చేశారు.
ఏడాదైంది..
2018 మార్చి 29కి నాని కుమారుడు అర్జున్ పుట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బాబుతో కలిసి దిగిన చక్కటి ఫొటోను ఆయన షేర్ చేశారు. ‘నేటితో ఈ చిట్టి రాస్కెల్ పుట్టి ఏడాదైంది. దొంగనా కొడుకు.. జున్నుగాడు’ అని పోస్ట్ చేశారు.
గర్వంగా ఉందమ్మా..
‘ఫార్మసిస్ట్‌గా 30 ఏళ్లు. ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. డాక్టర్లు, రోగులు ఆమెను ఇష్టపడుతుంటారు. అన్నింటినీ మించి ఆమెను మేం చాలా ప్రేమిస్తున్నాం. ఇవాళ ఉద్యోగినిగా ఆమెకు చివరి రోజు. నీ పట్ల గర్వంగా ఉంది అమ్మా. నువ్వు బ్యూటిఫుల్ పర్సన్’ అంటూ నాని తల్లితో దిగిన ఫొటోను షేర్ చేశారు.
మేమిద్దరం ఒకేలా..
అర్జున్ అచ్చం తన రూపు రేఖలతో ఉన్నాడని నాని అభిప్రాయపడ్డారు. తన చిన్నప్పటి ఫొటోను, కుమారుడి ఫొటోను జత చేసి.. ‘అవును.. మేమిద్దరం ఒకేలా ఉన్నాం. విభిన్న జనరేషన్ల నుంచి రియల్ టైమ్ డ్యూయల్ రోల్’ అని కొంటెగా నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు.
గిల్లికజ్జాలు..
నవంబరు 14న పిల్లల దినోత్సవం సందర్భంగా నాని కుమారుడితో గిల్లికజ్జాలు ఆడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఫాలోవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. కేవలం మూడు రోజుల్లో 5.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. రాశీఖన్నా ‘సో క్యూట్’ అని కామెంట్ చేశారు. ‘నేనెప్పుడూ కెమెరామెన్‌నే..’ అని నాని సతీమణి అంజనా పేర్కొన్నారు. ‘సరిపోయింది.. మరో నేచురల్ స్టార్ సిద్ధమౌతున్నాడు’ అని నీరజ కోన కామెంట్ చేశారు.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
