close

తాజా వార్తలు

మరో బాలీవుడ్‌ చిత్రంలో రకుల్‌

ముంబయి: ఇటు దక్షిణాది చిత్రాలతోపాటు అటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీ, బిజీగా లైఫ్‌ను గడుపుతున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా జాన్‌ అబ్రహాం చిత్రంలో రకుల్‌ సందడి చేయనున్నారు. జాన్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతన్న చిత్రం ‘ఎటాక్‌’. జాక్వెలిన్‌ ఫెర్నాండజ్ కథానాయిక. ఈ సినిమాలో రకుల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘దే దే ప్యార్‌ దే’, ‘మార్జావాన్‌’ చిత్రాలతో రకుల్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. జాన్‌ అబ్రహాం చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రకుల్‌ ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌-కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.