
తాజా వార్తలు
చెన్నై: ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నటుడు విజయ్ ఆంటోని. ఈ సినిమాతో ఆయన అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అగ్ని సిరగుల్’. ఈ సినిమాని తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ ఆంటోనీ శీను అనే పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను మాస్కో, రష్యా, కజకిస్థాన్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటరాజన్ శంకరన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
