close

తాజా వార్తలు

చై నవ్వుకు ఫ్లాటైన సామ్

హైదరాబాద్‌: తన భర్త చైతన్య నవ్వుకు ఫ్లాటయ్యారు నటి సమంత. తాజాగా చైతన్య షేర్‌ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ.. ‘ఆ నవ్వుతో చచ్చిపోయా’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక. శనివారం నుంచి ఈ సినిమాకు సంబంధించి ‘ఎక్స్‌పీరియన్స్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ #nc19’ పేరుతో ఓ ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం పంచుకోనుంది. ఈ నేపథ్యంలో గురువారం చైతన్య ట్విటర్‌ వేదికగా ఈ సినిమా నుంచి తన లుక్‌ను విడుదల చేశాడు. చై లుక్‌ చూసిన సమంత ఆయన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ‘చై.. ఆ నవ్వు చంపేసింది.’ అని తెలిపారు.

మరోపక్క శనివారం నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘వెంకీమామ’చిత్రంలో ఆయన పోషిస్తున్న  ‘కెప్టెన్‌ కార్తీక్‌’ పాత్రను పరిచయం చేయనున్నారు. ఇందుకు సంబంధించి వీడియోను విడుదల చేసే అవకాశం ఉంది. వెంకటేశ్‌తో కలిసి చైతూ నటిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. కె.ఎస్‌. రవీంద్ర బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.